కవితకు నేను బెయిల్ ఇప్పించగలను: కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

19-03-2024 Tue 15:56 | Both States
Advertisement
  • సీబీఐ భయం ఉంటే... ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావొచ్చునని సూచన
  • వరంగల్‌లో బాబుమోహన్‌కు కేసీఆర్ మద్దతిస్తే 12 లోక్ సభ స్థానాలు గెలిపిస్తానని వ్యాఖ్య
  • కేసీఆర్ మార్పు చెందు.. లేదంటే చిత్తుచిత్తుగా ఓడిపోతావని అప్పుడే హెచ్చరించానన్న కేఏ పాల్
Advertisement
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పించగలనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ భయం ఉంటే... ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావొచ్చునన్నారు. తాను వారిని కాపాడుతానని వ్యాఖ్యానించారు. 

'ఈరోజు కేసీఆర్ పూర్తిగా ఫినిష్ అయిపోలేదా? వందసార్లు.. వేయిసార్లు మార్పు చెందు కేసీఆర్, లేదంటే చిత్తుచిత్తుగా ఓడిస్తామని చెప్పలేదా? నువ్వు మారావా? పైగా నన్ను కొట్టించావ్... మే 2, 2022లో నీ కొడుకుతో... అనిల్ రెడ్డితో సిరిసిల్లలో కొట్టించావ్. ఆ రోజే నిన్ను శపించాను. నువ్వు మసి అయిపోలేదా? ఇప్పుడైనా గుండె ఆగి చనిపోవా? కానీ వద్దు... వరంగల్‌లో బాబు మోహన్‌కు మద్దతివ్వు... నేను నిన్ను క్షమిస్తా.. అలాగే 12 లోక్ సీట్లలో గెలిపిస్తాను' అని వ్యాఖ్యానించారు. 1451 సినిమాల్లో నటించిన బాబుమోహన్ టీడీపీని కాళ్లతో తన్ని బీజేపీలో చేరి... ఆ తర్వాత బీజేపీని కాళ్లతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారో ఆలోచించాలన్నారు. బాబుమోహన్ హిస్టారిక్ యాక్టర్ అని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు.

ఏపీ రాజకీయాలపై కూడా పాల్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకు మద్దతివ్వడం లేదు? నాకే సీక్రెట్‌గా ఎందుకు మద్దతిస్తున్నారు? ఏపీ ప్రజలు ఆలోచించాలని కోరారు.
Advertisement
KA PaulbabumohanBJPLok Sabha Polls

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more